Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీలో ఉచిత దుస్తుల పంపిణీ 

అంగన్వాడీలో ఉచిత దుస్తుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ లోని అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో బుధవారం చిన్నారులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ.. అంగన్వాడీ స్థాయి నుంచే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు, మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, చిన్నారుల ఆరోగ్యాభివృద్ధి, విద్యాభ్యాసానికి అంగన్వాడీ కేంద్రాలు కీలక వేదికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజలింగం, ఉప సర్పంచ్ పద్మ మెహన్, వార్డ్ సభ్యులు ప్రవీణ్, భాస్కర్, రాము, భోజన్న, నరేష్,సునీల్, కరాబర్ సంతు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -