నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని జక్కల వారి గూడెంలో నార్కట్పల్ కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరము ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జక్కల రేవతి మహేష్ మాట్లాడుతూ.. గ్రామాలలో దంత సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు నార్కట్పల్ కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి దంత సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం సేవలను గ్రామంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జక్కల పార్వతమ్మ ముత్యాలు ,మాజీ సర్పంచ్ జక్కల శ్రీను యాదవ్ , వార్డ్ నెంబర్ జక్కల శంకర్, జక్కల నాగరాజు, జక్కల అంజమ్మ , దాసరి దశరథ , కామినేని దంత వైద్యులు తదితరులు ఉన్నారు.
జక్కలవారి గూడెంలో ఉచిత దంత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



