Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం 

ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్  
వేల్పూరు మండల కేంద్రంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం బుధవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా పశు వైద్య అధికారి డాక్టర్ సంతోష్ రెడ్డి నాలుగు నెలల పైబడిన గోజాతి, గేదె జాతి పశువుల అన్నిటికీ తప్పకుండా టీకాలు వేయించుకోవాలని వివరించారు. గాలికుంటు వ్యాధి ప్రబలినచో నోటిలో పుండ్లు ఏర్పడతాయి. కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పశువులలో అధిక మొత్తం పాల దిగుబడి తగ్గి పాడి రైతులకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. కావున అందరూ తప్పకుండా తమ పశువుల అన్నింటికీ టీకాలు వేయించుకొవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది సురేష్ ,వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ గంగాధర్ ,లైవ్ స్టాప్ అసిస్టెంట్ దయానంద్ బాబూలాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -