– పశువైద్యాధికారి అనిల్
నవతెలంగాణ – బల్మూరు
గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని పశు వైద్యాధికారి అనిల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని జినుకుంట గ్రామంలో పశు వైద్య ఉప కేంద్రంలో పశువులకు టీకా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి జినుకుంట గ్రామ రైతులతో పాటు పరిసర గ్రామాల నుండి రైతులు పశువులను తీసుకొచ్చి టీకాలు ఇప్పించినట్లు తెలిపారు. పశు వైద్య శిబిరం సందర్భంగా 427 పశువులకు గాలి కుంటు వ్యాధికి సంబంధించి టీకాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు గ్రామాలకు వైద్య శిబిరం సిబ్బంది వస్తారని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పశువులను జాగ్రత్త పరుచుకొని గాలి కుంటు రోగాలు నుండి కాపాడుకోవాలని ఈ సందర్భంగా వైద్యాధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో పారా వెటర్నరీ సిబ్బంది, గోపాలమిత్ర, మైత్రి మరియు రైతులు సిబ్బంది ఉన్నారు.
ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES