కె6 ఛానల్ వ్యవస్థాపకులు సామ జయ ప్రకాశ్ రెడ్డి, జి. శ్రీనివాస్
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఈ నెల 26 మంగళవారం న కె6 ఛానల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ చేస్తున్నట్లు కే6 ఛానల్ వ్యవస్థాపకులు సామా జయప్రకాశ్ రెడ్డి, జి శ్రీనివాస్ లు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రాచీన పద్దతి ప్రతి ఆచార వ్యవహారాలు సామాజిక చైతన్యాన్ని ప్రకృతిని సంరక్షించి లోక కళ్యాణాన్ని కోరుకునే విధంగా ఉంటే దానికి విరుద్ధంగా నేటి ఆచారం పర్యావరణ వినాశనానికి దోహదపడుతున్న తరుణంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ లోకల్ ఛానెల్ కె6 ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకై ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా కొనసాగుతుందని ఛానల్ వ్యవస్థాపకులు సామ జయ ప్రకాశ్ రెడ్డి, జి. శ్రీనివాస్ లు తెలిపారు.
ఇందులో భాగంగానే పర్యవరణ పరిరక్షణకై భక్తులకు మట్టి గణపతులను అందించి ఒక నూతన అద్యాయానికి శ్రీకారం చుట్టిందని ప్రజలు తమ వంతు బాధ్యతగా మట్టి గణపతులే పూజించాలనే ఆలోచనలో పడడం చాలా సంతోషదాయకమని ప్రతి సారి మాదిరిగానే ఈ సారి కూడా 6 మాసాల క్రితమే కొల్కత్తా నుండి మట్టి గణపతులు తయారికి ఆడర్ చేసి 25 వేల మట్టి గణపతులను తీసుకురావడం జరిగింది. ఈ నెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా ఒక రోజు ముందు 26వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ కె6, కార్యాలయం సుభాష్ నగర్ నిజామాబాద్, ఎన్సీఎన్ కార్యాలయ మామిడిపల్లి ఎక్స్ రోడ్డు ఆర్మూర్ నందు ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం కలదని ఫౌండర్, సీఈవో శ్రీనివాస్ తెలిపారు.
ఈ నెల 26వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ సుభాష్ నగర్ లో గల జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న కె6, జి టి పి ఎల్, రోషిని, సామా మ్యూజిక్, సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయాల వద్ద ఉదయం 10 గంటల నుండి మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమం వుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ మంగిరాములు మహారాజ్, ఆర్మూర్ కు చెందిన అవార్డు గ్రహీత గురుస్వామి ప్రముఖ పండితులు గణపతి ఉపాసకులు శ్రీ బల్యపల్లి సుబ్బారావు ల చేతుల మీదుగా మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నట్లు ఛానెల్ చైర్మన్ సామ ప్రకాశ్ రెడ్డి ఫౌండర్, సీఈవో శ్రీనివాస్ తెలిపారు.ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచితంగా పంపిణీ చేస్తున్న మట్టి గణపతులను పూజించి ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.