– సీఐడీ చీఫ్ చారుసిన్హా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి గానూ తొలిసారిగా డ్రైవింగ్‌లో వారికి శిక్షణను ఇప్పిస్తున్నట్టు రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ చారుసిన్హా సోమవారం తెలిపారు. మహిళా భద్రతా విభాగం, మోవో స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నాయని ఆమె తెలిపారు. అంబర్‌పేట్‌లోని పోలీస్‌ట్రైనింగ్ కాలేజీలో జనవరి 3న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. 21-45 ఏండ్ల మధ్య వయసున్న మహిళలు ఈ శిక్షణకు అర్హులనీ, వారికి సుశిక్షితు లైన డ్రైవింగ్ సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా తమ సొంత కాళ్లపై నిలబడినప్పుడే మనోధైర్యంతో జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా ఎదుర్కోగలరనీ, ఆ లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చారుసిన్హా తెలిపారు.
జనవరిలో ‘ఆపరేషన్ స్మైల్’
తప్పిపోయిన పిల్లలు మొదలుకొని బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను రక్షించడానికి గానూ వచ్చే జనవరిలో 30 రోజుల పాటు ‘ఆపరేషన్ స్మైల్’ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ చారు సిన్హా తెలిపారు. ఈ ఆపరేషన్ నిర్వహణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సోమవారం పోలీసు, కార్మికశాఖ, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, జువైనల్ హౌం, ఎన్జీఓలతో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సమన్వయ సమావేశంలో చారుసిన్హా మార్గనిర్దేశం చేశారు. భావిభారత పౌరులైన అనాథ పిల్లలు మానవ అక్రమ రవాణాకు లోనుకాకుండా చూడటంతో పాటు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో వారి బాల్యం చిదిమిపోకుండా మంచి భవిష్యత్తును ఇచ్చే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్‌ను నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు.
మహిళలకు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



