- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ పథకం ద్వారా ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించనుంది. ఈ పథకం కింద జిల్లాలో 3,159 మంది గిరిజనుల ఇళ్లకు రూ.15.87 కోట్లతో విద్యుత్ సరఫరా చేయనున్నారు. మీటర్, స్విచ్ బోర్డు, ప్లగ్ పాయింట్‌తో సహా అన్ని పరికరాలు ఉచితంగా అమర్చుతారు. మార్చి నెలాఖరులోపు ఈ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
- Advertisement -



