- Advertisement -
- ఈనెల 25లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- నవతెలంగాణ – రాయికల్
పట్టణ కేంద్రంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్,జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సంయుక్తంగా మహిళలకు అందిస్తున్న టైలరింగ్, హోమ్ ఎయిడ్ హెల్త్, పురుషులకు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సుల్లో 3 నెలల పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్ కోర్సులో చేరడానికి చదవడం రాయడం వచ్చి ఉండాలని, హోం ఎయిడ్ హెల్త్,ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పదవ తరగతి ఉత్తీర్ణులై, వయస్సు 18 నుండి 30 సంవత్సరాలలోపు గల వారు ఈనెల 25వ తేదీలోపు 9963347142 ఫోన్ నెంబర్ యందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
- Advertisement -