నవతెలంగాణ – నసురుల్లాబాద్
బీర్కూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ చైర్మన్ సితాలే రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 27 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఐదు మందికి కంటిలో మోతి బిందువు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కంటి ఆపరేషన్ కొరకు లైన్స్ క్లబ్ ఆస్పత్రి బోధన్ కు పంపించినట్లు వైద్యులు తెలిపారు. అలాగే మరి కొంత మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించి వారికి కంటి అద్దాలు వాడాలని సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సంపూర్ణ అంధత్వ నివారణ, మండలంలో సామాజిక సేవ చేయడమే లక్ష్యంగా, లైన్స్ క్లబ్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య సహాయకులు సతీష్ , లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మెన్ కోట్టురి సంతోష్ సెట్, సీనియర్ లయాన్ కిషోర్ దాస్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో ఉచిత కంటి శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES