Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బషీరాబాద్ లో ఉచిత కంటి పరీక్షల శిబిరం

బషీరాబాద్ లో ఉచిత కంటి పరీక్షల శిబిరం

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. నిజామాబాద్ కు చెందిన కంటి వైద్య నిపుణులు డాక్టర్ టి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిబిరానికి హాజరైన వారికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.95 మందికి కంటి పరీక్షలు చేయగా 17మంది బాధితులకు కంటి ఆపరేషన్లు అవసరంగా గుర్తించారు.

ఈ సందర్భంగా కండ్ల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విటమిన్ ఏ సమృద్ధిగా దొరికే ఆహార పదార్థాలపై డాక్టర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు.అంతకుముందు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని సర్పంచ్ బైకాన్ జమున మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, వార్డ్ సభ్యులు నెల్ల రమేష్, బందేలా రాజు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శివానంద్, నాయకులు తిరుపతి, లక్మ మహేష్, నెల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -