Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస కొత్తూర్ లో ఉచిత కంటి పరీక్షల శిబిరం

హాస కొత్తూర్ లో ఉచిత కంటి పరీక్షల శిబిరం

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో గిరిజ ఐ ఆస్పత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ప్రధాన కార్యదర్శి నెలిమెల రేవతి గంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఉచిత కంటి పరీక్షల శిబిరానికి హాజరైన ప్రజలకు కంటి వైద్య సహాయకులు ప్రతాప్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ప్రధాన కార్యదర్శి నెలిమెల రేవతి గంగారెడ్డి మాట్లాడుతూ.. కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఉచితంగా చేయిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని కంటి సమస్యలు ఉన్న గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుందేటి శ్రీనివాస్, వార్డు సభ్యుడు కనుక నర్సయ్య, దాస రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -