- Advertisement -
నవతెలంగాణ కంఠేశ్వర్ : నిజామాబాద్ అగర్వాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు జూన్ 6(శుక్రవారం) ఉదయం 9 గంటల నుండి పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్ సుభాష్ నగర్ లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ప్రముఖ డాక్టర్లతో, అగర్వాల్ ఆస్పత్రి సిబ్బందితో కంటి వైద్య పరీక్షలు నిర్వహించబడును. అన్ని టెస్ట్ లు ఉచితంగా చేయబడును. ఈ హెచ్ ఎస్ తో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారు వారిపై ఆధారపడిన వారు కూడా ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. ఆపరేషన్ అవసరమైతే ఈ హెచ్ ఎస్ , సిజిహెచ్ఎస్, ఆల్ ఇన్సూరెన్స్ లబ్ధిదారులకు ఉచితంగా చేయబడును అని తెలిపారు.
- Advertisement -



