- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిడీలోగల పీవీనగర్ లో శరత్ మ్యాక్సి విజన్ కంటి ఆస్పత్రి, కొయ్యూర్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో కంటి వైద్యులు పరిశీలించారు. కళ్ళకు పొరలు,అద్దాలు అవసరం ఉన్నవారిని గుర్తించారు.కళ్ళకు పోరలున్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయనట్లుగా,చిన్నచిన్న సమస్యలున్న వారికి అద్దాలు,ఐ డ్రాప్స్ ఇవ్వనున్నట్లుగా తెలిపారు.వైద్య శిబిరాన్ని నిర్వహించిన వైద్య బృందానికి,యూత్ సబ్యులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాక్సీ విజన్ వైద్యులు, యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -