Saturday, October 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్6న ఉచిత కంటి వైద్య శిబిరం..

6న ఉచిత కంటి వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్ లో ఈ నెల 6వ తేదీ సోమవారం  కరీంనగర్ శరత్ మాక్సవిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి దవాఖాన సౌజన్యంతో జన్నారం మండల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించబడునని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆరోగ్య భీమా పాలసీదారులు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు సింగరేణి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్స్( ఈ హెచ్ ఎస్), ఆరోగ్య భద్రత(పోలీస్ శాఖ) నగదు రహిత కాంటాక్ట్ ఆపరేషన్స్ చేసుకోవడానికి అర్హులని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దుర్గం రాజలింగం, ఉపాధ్యక్షులు వి. రామకృష్ణ, పిట్ట రాజారావు, సహాయ కార్యదర్శి గాబ్రియల్, కోశాధికారి యాద పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -