Wednesday, February 4, 2026
E-PAPER
HomeNewsఉచిత గ్యాస్ కనెక్షన్లు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా సేల్స్ ఆఫీసర్

ఉచిత గ్యాస్ కనెక్షన్లు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా సేల్స్ ఆఫీసర్

- Advertisement -

నవతెలంగాణ – నూతనకల్
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచితంగాఅందించే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ను సద్వినియోగం చేసుకోవాలని సూర్యపేట ఖమ్మం జిల్లాల ఇండేన్ సేల్స్ ఆఫీసర్ జి. ప్రవీణ్ కుమార్, ఇండేన్ గ్యాస్ మండల డిస్ట్రిబ్యూటర్ గిరిధర్ రెడ్డిలు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో లబ్ధిదారులకు పంపిణీ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డు పొందిన వారు, గతంలో ఎలాంటి గ్యాస్ కనెక్షన్ లేని రేషన్ కార్డు కలిగిన వారు, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మధ్యవర్తులను కాకుండా నేరుగా ఏజెన్సీ ద్వారా పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది ఉపేందర్, మహేష్, ఉపేందర్ మండల ప్రజలు, అశోక్ యాదవ్, ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -