పాలనా పీఠం కైవసంకై
బలప్రదర్శనార్భాటం
గుండా – నేతల యుగళగీతం
పోలీసుల ద్విపాత్రాభినయం
ఎండమావులను తలదన్నె
వెర్రభిమాన వ్యామోహం
జనం మేలు కాంచని నేతృత్వం
జాతికిపట్టిన గ్రహణం
దిశానిర్దేశం వుండదు
శాస్త్రీయాచరణ కరువు
ఎటు చూసినా ఏముంది?
అమాయక ప్రాణలే హరి!
ఒకరిపై మరొకరు
దుమ్మెత్తి పోసుకోవడం
నవనాగరిక రాజనీతి?
కరిమింగిన వెలగలా
ప్రజాస్వామ్యపు గతిర?
అమెరికా ట్రంప్
అంబానీ ఆదానీల
స్తోత్ర జపం!
గాజాపై ఇజ్రాయిల్
ఆయుధ దాడిపై మౌనం!
పాక్‌పై క్రికెట్ ఇండియా
విజయ వీరంగం
ఆత్మనిర్భర్‌గా
ధాతి బోరవిరవడం!
హత్యలు అత్యాచారాలు
ఆత్మహత్యలుపై కినుక
పౌష్టికాహార లోపంపై
నోరు మెదపక
బాలకార్మిక వ్యవస్థ
చెరగని ఓ పెద్ద మరక
విలువలతో కూడిన విద్య
కనుచూపులో కానరాక
మద్యం మత్తులో
యువత జోగునిక
పర్యావరణ విధ్వంసంపై
కళ్లుమూసుకుని పాలుతాగు
పాలక మార్జాలం
అవినీతి అందలమే
ఈ పాలన పీఠం?
మారుకుంటేనే కదా
మనది ముక్తభారత్.
- కె.శాంతారావు, 9959745723