- Advertisement -
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్ : కరీంనగర్ మెడి కవర్ ఆస్పత్రి, బిగ్ టీవీ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో కలిపి దాదాపు 150 మందికి బిపి, షుగర్, సిబిపి, ఈసీజీ, టూడి ఎకో తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి వైద్యులు లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ,మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ , లక్ష్మీ రాజం,శ్రీకాంత్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్, ప్రెస్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -