Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందల్ వాయి ఆస్పత్రిలో ఉచిత వైద్య శిబిరం..

ఇందల్ వాయి ఆస్పత్రిలో ఉచిత వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలో మంగళవారం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ” స్వస్త్  నారీ ససక్త్ పరివార్ అభియాన్ ” ‘ఆరోగ్య మహిళ   శక్తివంతమైన కుటుంబం’ కార్యక్రమంలో బాగంగా మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర  వైద్యాధికారి డాక్టర్ షారోన్ షైని క్రిస్టినా సోమవారం తెలిపారు.

ఈ శిబిరంలో 9మంది డాక్టర్లు పాల్గొంటున్నారని వివరించారు. దినిలో స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలు డాక్టర్ రోహిణి, జనరల్ మెడిసిన్ డాక్టర్ శ్రావ్య, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అమీనా,జనరల్ సర్జన్ డాక్టర్ అక్షయ్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి, చెవి ముక్కు గొంతు నిపుణులు సయ్యద్ నిధ ఆయేషా ఖాద్రి,  చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రియాంక, మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ రాజేందర్, దంత వైద్య నిపుణులు డాక్టర్ శశిధర్ పాల్గొంటున్నారని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర  వైద్యాధికారి డాక్టర్ షారోన్ షైని క్రిస్టినా కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -