కంటైనర్ హాస్పిటల్లో వార్షికోత్సవ వేడుకలు
కంటైనర్ హాస్పటల్లో ఏజెన్సీ రోగులకు విశిష్ట సేవలు
కొడిశల పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల ఏజెన్సీలోని ఆదివాసి గిరిజన ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి గత సంవత్సరం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్ లు పోఛాపూర్ ఏజెన్సీలో వైద్య సేవలు అందించడానికి అదనపు ఆరోగ్య ఉపకేంద్రం (కంటైనర్ హాస్పిటల్) ఏర్పాటుచేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటుచేసి ఉచిత వైద్య సేవలు సేవలందించడం సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కంటైనర్ హాస్పిటల్ లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. సంవత్సర కాలం నుండి పోచాపూర్ ఏజెన్సీలో విశిష్టత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు కంటైనర్ అదన ఉపకేంద్రం ద్వారా 2984 మందికి ఉచిత వైద్య సేవలు, 450 మందికి జ్వర పీడితులు కు ఆర్డిటి రక్త పరీక్షలు నిర్వహించగా 8 మలేరియా పాజిటివ్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. 12 మంది గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్గా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడుగురు పాలిచ్చే కల్లులకు ప్రాముఖ్యత తెంచి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కురిసెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఈ సీజనల్ లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచించారు. దోమల నుండి దోమతెరలు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ బాలు, ఫార్మసిస్ట్ వెంకట్, ఆరోగ్య కార్యకర్త సీతారామరాజు ఏఎన్ఎం కృష్ణవేణి ఆశా కార్యకర్తలు సులోచన, పుష్పలత, శ్యామల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పోచాపూర్ కంటైనర్ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES