నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 134వ ఉచిత మెగా వైద్య శిబిరం భువనగిరి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రోనక్ దినేష్ సోనీ చే ఉచిత కన్సల్టేషన్ నిర్వహించి డాక్టర్ సలహా మేరకు సిబ్బందికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఆర్థోపెడిక్ డాక్టర్ చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ డాక్టర్ రోనాక్ దినేష్ సోనీ పోలీసు సిబ్బందికి కీళ్లవాతం వాటి లక్షణాలు, వాటి తీవ్రత తగ్గించుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి తమ సిబ్బందికి మరి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించినందుకు రూరల్ ఎస్ఐ రూరల్ అనిల్ కుమార్ డాక్టర్ లకి కృతజ్ఞతలు తెలియజేశారు.



