Sunday, June 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్ఎంపీ డాక్టర్ల ఉచిత వైద్య శిబిరం..

ఆర్ఎంపీ డాక్టర్ల ఉచిత వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ  – జుక్కల్ : నానీజ్ రామ్ పీఠాధిపతి శ్రీ నరేంద్ర మహారాజ్ స్వామి వారి సేవలో ఉచిత ఆరోగ్యశ్రీరం జుక్కల్ ఆర్ఎంపి వైద్యుడు పోచారం సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. గత రెండు రోజులుగా స్వామివారి సేవలో ఉంటూ వచ్చే భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యం చేసేందుకు వారికి ఉచితంగా మందులు పంపించేందుకు వీలుగా జుక్కల్ మండలం దోసుపల్లి గ్రామంలోని ఉపపీఠం వద్ద గత కొన్ని నీళ్లు గా నిరంతరంగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన ఈ ఉచిత వైద్య సేవలో వైద్యులు పాల్గొనడం ఇక్కడి ప్రజలు హర్షిస్తున్నారు. మిగతా సమస్యలు ఏవైనా ఉంటే కూడా వారు ఇక్కడ ఎటువంటి ఋషులు చెల్లించకుండా మందులు వైద్యా పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని వైద్య క్యాంపు నిర్వహిస్తున్న జుక్కల్వాసి ఆర్ఎంపి వైద్యుడు పోచారం సుధాకర్ తెలిపారు. ఆయన వంట వైద్య సిబ్బంది , ల్యాబ్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -