నవతెలంగాణ – వేములవాడ
ట్యూబర్‌క్లోసిస్ (టీబీ) నిర్మూలన లక్ష్యంగా, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ దివ్యశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 102 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 18 మందికి తెమడ పరీక్షలు చేపట్టగా, 12 మందిని ఎక్స్-రే కోసం స్థానిక వేములవాడ ఏరియా ఆసుపత్రికి పంపించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా న్యాకో కోఆర్డినేటర్ సురేందర్ రెడ్డి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ప్రవచని, ఆరోగ్య పర్యవేక్షకులు గంగమరాజు, సీనియర్ టీబీ సూపర్వైజర్ గంగాధర్, ల్యాబ్ టెక్నీషియన్ ప్రకాష్, ఏఎన్ఎంలు వెంకటలక్ష్మి, శైలజ, ఆశ కార్యకర్తలు తో పాటు తదితరులు ఉన్నారు.
వేములవాడలో టీబీ నిర్మూలన ఉచిత వైద్య శిబిరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES