Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతాపూర్ లో ఉచిత వైద్య శిబిరం

అంతాపూర్ లో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో గురువారం సుర్నర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పార్వతి బాయి, ఉపసర్పంచ్ సంగీత అఖిల్, ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దత్తు ఆధ్వర్యంలో నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన సుర్నార్ హాస్పిటల్ వైద్యులు ప్రజలకు ఉచిత చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరం ప్రజలకు ఉపయోగపడిందని, సూర్య హాస్పిటల్ వైద్యులు గ్రామానికి వచ్చి ఉచితంగా చికిత్సలు అందించి కావలసిన మందులు పంపిణీ చేసినందుకు వారికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -