నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని కాచికల్ గ్రామంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ శారద ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఎర్రబెల్లి గూడెం పల్లె దవాఖాన డాక్టర్ పార్లపల్లి రవళి తెలిపారు. గురువారం 85 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సీజన్లో వచ్చే జబ్బులపై ప్రత్యేక జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ క్రమంలో ఏదైనా వైద్య పరంగా సమస్య వచ్చినట్లయితే దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా చూసుకున్నట్లయితే ఈ సీజనల్ వ్యాధుల నుండి బయటపడవచ్చు అని అన్నారు. ఈ కాలంలో ఇండ్ల చుట్టూ వాడలలో నీటి నిల్వలు లేకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. దోమల నుండి ఈ వర్ష కాలం లో దోమల కొడితే డెంగు మలేరియా జ్వరాలు వస్తాయని దోమతెరలు వాడితే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవితేజ ఏఎన్ఎం రమాదేవి ఆశ వర్కర్లు సుజాత సుగుణ భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కాచికల్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -