- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని పద్మాజివాడి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు సర్పంచ్ లోకోటి సుబ్బారావు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడంజరిగిందని తెలిపారు. ఈ శిబిరాన్ని పద్మాజి వాడి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యంపై డాక్టర్లు అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్లవెల్లి రాజశేఖర్ రెడ్డి వార్డ్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



