- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎం.వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం పెద్దతూండ్ల గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రోగాలకు సంబంధించిన 59 మంది రోగులకు షుగర్, బీపీ, డెంగ్యూ, మలేరియా తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, రోగుల సంబంధిత టెస్టులు చెసి వారిని ఈహెచ్ఎంఐఎస్, ఓపిడి ఎంటర్ చేసి వారికి సంబధించిన మందులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే వర్షా కాలం సీజన్లో పాటించాల్సిన సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ సంగీత, పంచాయతీ కార్యదర్శి సతీష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -