- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : మాచారెడ్డి మండలంలోని సోమార్పేట గ్రామంలో హైదరాబాద్ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ల బృందం సోమార్పేట గ్రామంలోని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు వివిధ పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవసిలాల్ నాయక్, ఏఎంసి డైరెక్టర్ నునావత్ గణేష్ నాయక్, మాజీ సర్పంచ్ మహమ్మద్ రంజాన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -