Wednesday, October 29, 2025
E-PAPER
Homeఖమ్మంనవంబర్ 1న ఉచిత మెడికల్ క్యాంపు…

నవంబర్ 1న ఉచిత మెడికల్ క్యాంపు…

- Advertisement -

– ప్రముఖ ఇండస్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత వైద్య సేవలు…

– ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

– సీపీఐ(ఎం) పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్

నవతెలంగాణ ఖమ్మం: బోడేపూడి విజ్ఞాన కేంద్రం, సీపీఐ(ఎం) టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ న మొదటి శనివారం మంచికంటి హల్ లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, బివికె మేనేజర్ వై.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి నెలా ఫస్ట్ శనివారం మెడికల్ క్యాంపు జరుగుతుంది అని తెలిపారు. ప్రముఖ హాస్పిటల్ ఇండస్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఈ నెల మెడికల్ క్యాంపులో ఉచితంగా వేల రూపాయలు విలువ చేసే డయాబెటిక్ కంటి నరం పరీక్షలు, కిడ్నీ సిరమ్ క్రియాటినైన్ పరీక్షలు కూడా చేస్తున్నట్లు తెలిపారు.

బిపి, షుగర్ , తదితర అనారోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ జరుగుతుంది అని తెలిపారు. నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సి భారవి, డాక్టర్ రాజేష్ , డాక్టర్ జెట్ల రంగారావు, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు, డాక్టర్ అల్లంపాటి రమేష్ రెడ్డి, డాక్టర్ జొన్నలగడ్డ వరుణ్, డాక్టర్ డి దినేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ గుర్రం వినీల్, డాక్టర్ పవన్, డాక్టర్ అభినయ్ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటలకు వరుకు మెడికల్ క్యాంపు జరుగుతుంది అని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -