నవతెలంగాణ -పరకాల
జై భీమ్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో వెల్లంపల్లి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించడం జరిగింది. శనివారం ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఉద్దేశించి యూత్ అధ్యక్షులు బొట్ల అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో వ్యాప్తి చెందుతున్న జ్వరాలు, బ్యాక్టీరియల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో పేదవారికి వైద్య చికిత్స అందడం కష్టమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
క్యాంపులో డాక్టర్ విశ్వంత్ రెడ్డి (జనరల్ & డయాబెటిక్ ఫిజీషియన్) ఆధ్వర్యంలో ఉచిత కన్సల్టేషన్, రక్తపరీక్షలు, ఉచిత మందుల పంపిణీ జరిగింది. అలాగే పళ్ళు-దంతాల సంబంధిత చికిత్సలను డాక్టర్ ఎం బాపురావు అందించారు.
ఈ శిబిరం ద్వారా రెండు వందల మంది రోగులు చికిత్స పొందారన్నారు. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు గ్రామంలోనే అందించడం విశేషంగా మారింది. కార్యక్రమంలో జై భీమ్ యూత్ ఇన్‌చార్జీలు కాకి శరత్ చంద్ర, మచ్చ చందర్, పెండేల అజయ్, సలహాదారు కాకి సతీష్, కార్యదర్శి బరిగెల విజేందర్, ఉపాధ్యక్షులు బరిగెల శ్రీను, సభ్యులు మచ్చ టెనం, భవేష్, సుమంత్, దుర్గప్రసాద్, పవన్, స్టీఫెన్, రజినీకాంత్, బొట్ల రమ్య పాల్గొన్నారు.అలాగే మాజీ సర్పంచ్ గంట సమ్మిరెడ్డి, ఉప సర్పంచ్ లత విక్రం, గ్రామ పెద్దలు కేతపాక రవి, ఆశా వర్కర్లు, హాస్పిటల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.