నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ / బీబీనగర్
భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండలంలోని అన్నం పట్ల గ్రామంలో 125 ఉచితమేగా వైద్య శిబిరాన్ని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిలుగా ఎస్సై విజయ, శ్రీ ఆర్కే హాస్పిటల్ అధినేత జాతీయ వైద్యరత్న అవార్డు గ్రహీత డాక్టర్ చావా రాజకుమార్ లు హాజరై, మాట్లాడారు.
గ్రామ ప్రజలకు వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమయానుగుణంగా చిన్న చిన్న వైద్య పరీక్షలు నిర్వహించడం వలన రానున్న కాలంలో రాబోయే పెద్ద పెద్ద రోగాలను నివారించుకోగలమని దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా జనరల్ టెస్టులను ఎప్పటికప్పుడు చేయించుకుని ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన లేక, చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల అనుకొని పరిస్థితులలో కుటుంబ సభ్యులను కోల్పోతున్నారని దాని వలన పూర్తి కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి మూడు నుండి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా మంచిదని గ్రామ ప్రజల కోసం వారి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం కోసం ఇటువంటి వైద్య శిబిరాలను నిర్వహించి కృషి చేస్తున్నందుకు డాక్టర్ చావా రాజ్ కుమార్, వారి బృందాన్ని ఎస్సై విజయ అభినందించారు. ఈ వైద్య శిబిరంలో బిపి షుగర్ న్యూరోపతి బిఎండి మొదలగు పరీక్షలు 150 మందికి పైగా గ్రామ ప్రజలకు నిర్వహించి, వారికి అవసరమగు మందులు డాక్టర్ సలహా మేరకు పంపిణీ చేసినట్లు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.



