Saturday, August 23, 2025
E-PAPER
spot_img
HomeNewsజనవికాస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

జనవికాస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని చిన్నవంగర గ్రామంలో జనవికాస ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొర్రూరు మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో, డాక్టర్ కోట నరేష్, రాధాకృష్ణ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచులు పాకనాటి రామకృష్ణ రెడ్డి, జలగం లక్ష్మి, జన వికాస మెయిన్ కోఆర్డినేటర్ మద్దెల రమ మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వ్యవహరిస్తారని, వారికి అవగాహన కల్పించేందుకు తరచూగా జన వికాస ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు  తెలిపారు.

జన వికాస స్వచ్ఛంద సంస్థ గ్రామాల్లో కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నివాస ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఎం. సరిత వైద్య బృందం కిరణ్ కుమార్, శ్రీకాంత్, కారోబార్ మధుకర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad