నవతెలంగాణ – చౌటకూర్ : మండలంలోని సరఫ్ పల్లి గ్రామంలో శనివారం ఎస్ ఎం ఎఫ్ జి గ్రామ్ శక్తి ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్యం అందించారు. క్రెడిట్ మేనేజర్ మనీష్ మాట్లాడుతూ.. ఎస్ ఎం ఎఫ్ జి గ్రామ శక్తి ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కో గ్రామంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని పశువులకు ఉచిత వైద్యం, చెకప్, సాధారణ చికిత్స, పశువులకు సంబంధించిన మందులు ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు.ఈ కార్యక్రమాన్ని పశు వైద్యశాల డాక్టర్ ఆధీనంలో ఎస్ ఎం ఎస్ జి గ్రామ్ శక్తి పశు వికాస్ సిబ్బంది అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలోని పశు కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంచంద్రారెడ్డి,వార్డు మెంబర్ నాగుల్ గౌడ్, ఎస్ ఎం ఎఫ్ జి స్టేట్ క్రెడిట్ మేనేజర్ ఎన్.మనీష్,వంశీ హెచ్ఆర్ మేనేజర్, లక్ష్మణ్ బ్రాంచ్ మేనేజర్,రాకేష్ బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్, శ్రీకాంత్ ఏయూఎం,జోషిత హెచ్ఆర్,శివ బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది ఫాహీం,రాజశేఖర్,రమేష్,ప్రసాద్, మహేష్,ప్రసన్న, కళ్యాణ్,గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎస్ఎమ్ఎఫ్ జి గ్రామ్ శక్తి ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



