నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ ఉద్యోగులకు, పరిసర ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరము యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భువనగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు పలుకుల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, డిఆర్డి అధికారి నాగిరెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ కార్యదర్శి తవిటి వెంకట నారాయణ, అసిస్టెంట్ గవర్నర్ జగదీశ్వర్, 31 50 డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని హరిహర ప్రసాద్, స్థాపక సభ్యులు శెట్టి బాలయ్య యాదవ్, ప్రకాష్ రెడ్డి, తెంపళ్ల బుచ్చిరెడ్డి, మాజీ అధ్యక్షులు కలిపి నరసింహారావు, మాజీ కార్యదర్శి కూచిపట్ల సత్యనారాయణ రెడ్డి, వండర్ శ్రీనివాసరావు, గౌరవ రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
యశోద హాస్పిటల్ కు చెందిన పదిమంది వైద్యుడు వైద్యుల బృందం తమ సిబ్బందితో కలిసి అన్ని వైద్య పరీక్షలను నిర్వహించారు. దీనిలో కలెక్టర్ కార్యాలయం చెందిన అధికారులు, ఉద్యోగులు కూడా ఉన్నారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా.. ఆరోగ్య పరిరక్షణ అనేది ముఖ్యమని, ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ అధ్యక్షులు పలువుల నాగేశ్వరరావును కలెక్టర్ అభినందించారు. రోటరీ క్లబ్ ప్రజాసేవలో సఫలీకృతం అయినందుకు వారు అభినందనలు తెలియజేశారు.
రోటరీ 3150 గవర్నర్ నామిని శ్రీ హరిహర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒక అగరగాని సేవా సంస్థగా రోటరీ క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రస్తావించారు. పల్స్ పోలియో నిర్వహణలో రోటరీ క్లబ్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. యశోద హాస్పిటల్ కు చెందిన పదిమంది వైద్యుల బృందం సిబ్బందితో కలిసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, రోటరీ క్లబ్ సిబ్బంది సభ్యులు పాల్గొన్నారు.