Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాయపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం..

రాయపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ / ఆత్మకూరు
భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం  ఆత్మకూరు మండలం రాయపల్లి గ్రామం నందు నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు గ్రామ ప్రజలకు ఉచితంగా జనరల్బి ఫిజీషియన్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ రాజ్ కుమార్   చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిపి, షుగర్, న్యూరోపతి, బిఎండి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. బీపీ షుగర్ థైరాయిడ్ మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన లక్షణాలు, వాటి నివారణకు తీసుకొని వలసిన తగు జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. 

అనంతరం ఆర్థోపెడిక్ డాక్టర్ రోనాక్ దినేష్ఎ సోనీ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు కీళ్లవాతం వాటి లక్షణాలు, వాటి తీవ్రత తగ్గించుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సుమారు 2500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ అంజయ్య  డాక్టర్ రాజకుమార్ ను  శాలువాతో సన్మానించారు. మారుమూల గ్రామంలో వైద్య సేవలు అందించడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  ఇంద్రాల అంజయ్య ఉప సర్పంచ్ పంజాల రామకృష్ణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -