– ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దోమటి ప్రసన్నకుమార్
నవతెలంగాణ -పరకాల : ఐ.ఎం.ఏ వరంగల్ వారి ఆధ్వర్యంలో పరకాల మండలం మల్లక్క పేట గ్రామం లో సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించనున్నట్లు ఐఎంఎ స్టేట్ కౌన్సిల్ సభ్యులు దొమ్మటి ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ ఉచిత వైద్య శిభిరం లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్స్ , జనరల్ సర్జరీ విభాగ నిపుణులు , ఎముకలు కీళ్ళ వైద్య నిపుణులు, యూరాలజీ, గుండె, కంటి, స్త్రీ వైద్య నిపుణులు, అందుబాటులో ఉంటారు. ఈ శిభిరం లో ఉచిత కంటి వైద్య పరీక్షలతో పాటు, ఉచితముగా షుగర్. బీపీ ఈసిజి లాంటిపరీక్షలతో పాటు,ఉచితముగా మందులు అందించనున్నట్లు తెలిపారు.ఈ వైద్య శిబిరాన్ని సమీప ప్రాంతంలో ని ప్రజలు వినయోగించు కొని వైద్యసలహాలు పొందాలని సూచించారు.శనివారం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ పిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య పర్యవేక్షించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఉచిత మెగా వైద్య శిభిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES