Friday, October 24, 2025
E-PAPER
HomeNewsయధేచ్చగా అక్రమ మొర్రం రవాణా

యధేచ్చగా అక్రమ మొర్రం రవాణా

- Advertisement -

పట్టించుకోని సంబంధిత అధికారులు
నవతెలంగాణ –  జుక్కల్

మండలంలో పలు గ్రామంలో మొర్రం మాఫియా యదేచ్ఛంగా కొనసాగుతోంది. ప్రతి ఏటా ఈ తంతు కొనసాగుతున్న రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మొరం మాఫియా వ్యక్తులు సెలవుల రోజుల్లో సందర్భంలోనే మట్టిని తరలించేందుకు ఏర్పాట్లను పక్కడ్బిందీగా చేసుకొని ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. పర్యావరణ నియమ నిబంధనలు తుంగలలో తొక్కి కొంతమంది వ్యక్తులు పోటాపోటీగా మొరం దందాను కొనసాగిస్తున్నారు. అధికారులే ఇన్ డైరెక్ట్ గా మొరం మాఫియాతో ఒప్పందాలు కుదుర్చుకొని సెలవు దినాలలోని తమ వ్యాపారాన్ని కొనసాగించాలని, సెలవు దినాలలో మొరం మాఫియా వ్యక్తులు అధికారులు ఉండాలని తమకు అడ్డు అదుపు చెప్పే వారే లేరని ధీమాతో దందా కొనసాగిస్తున్నారు.

రోడ్లపై మట్టితో నింపుకొని వెళ్తున్న వాహనాల  వలన మాఫియా వ్యక్తులు విచ్చలవిడిగా ఇటీవల వేసిన రోడ్లు ధ్వంసం అయ్యే విధంగా ప్రజాధనాన్ని తూట్లు పొడుస్తూ అధిక లోడుతో  మట్టిని తరలిస్తూ  తమ దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న సామెతకు అనుకూలంగా దందాను కొనసాగిస్తున్నారు. మొరం మట్టి మాఫియా చేసే వ్యక్తులు మండలంలోని గ్రామాలలో తమకు అనుకూలంగా ఉన్న గ్రామానికి చెందిన ఒకరిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని, వారికి కొంత కమిషన్ ముట్టజెప్పి వారి ద్వారా గ్రామాల పెద్ద మనుషులను ప్రసన్నం చేసుకొని తమ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఇదేగాక చెరువులలోని మట్టిని కూడా ఎటువంటి అనుమతులు లేకుండానే చెరువు మట్టిని కూడా వదలకుండా దందా చేస్తున్నారు.

మండలంలోని పలు గుట్టలలో మట్టిని తరలించడం వలన గుట్టలు , పర్వతాలు కంటికి కనబడకుండా మట్టిని తవ్వడంతో మాయమైపోయాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా పట్టాలు పొందేందుకు అడ్డదారులు గుండా రెవెన్యూ కార్యాలయంలో రాజకీయ ఒత్తిళ్లు చేసి పట్టా చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పేద వర్గాల ప్రజలను రెచ్చగొట్టి , వారిని మచ్చిక చేసుకుని వారికి కొంత ప్రభుత్వ భూమిని తమ వాటాలు కొంత భాగాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. తరువాత తమకు పట్టా ఇవ్వాలని వారిచేత ధర్నాలు , రాస్తారోకోలు , వినతి పత్రాలు అధికారులకు ఇచ్చుకుంటూ ప్రభుత్వంపై, అధికారుల పై ఒత్తిడి తీసుకోస్తున్నారు.

మొర్రం మాఫియా వ్యక్తులు గ్రామాలలోని ఏజెంట్ల ద్వారా దూరాన్ని బట్టి రేట్లు నిర్ణయించి మొరం మట్టిని తరలిస్తూ గ్రామస్తుల వద్ద ముక్కు పిండి అధిక రేట్లకు వసూలు  చేస్తున్నారు. ఇప్పటికైనా మండలంలో జరుగుతున్న మొరం మట్టి మాఫియా ను అదుపు చేసి , ప్రకృతి సంపదను , పర్యావరణాన్ని తూట్లు పొడిచి నష్టం పరిచే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రకృతి సంపదను కాపాడాలని మండల ప్రజలు , పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -