Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్దికుంట పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ ప్రారంభం 

మద్దికుంట పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మద్దికుంట మండల పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశానుసారం ఫ్రీ ప్రైమరీ (యల్ కే జి)ని మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు ప్రారంభించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలో ప్రీ ప్రైవరీ ప్రారంభించడం సంతోషదగ్గ విషయమని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు 4 సంవత్సరాలు నిండిన తమ పిల్లలను పాఠశాలకు పంపి వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఏఏపీసీ చైర్మన్ బాల లక్ష్మి, వి డి సి చైర్మన్ కొడగండ్ల రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -