సి ఐ యు టి జిల్లా అధ్యక్షులు దాసరి పాండు…
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రీ ప్రైమరీ శ్రీవిద్య స్కూళ్లను అంగన్వాడి కేంద్రాలకు అప్పగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. శుక్రవారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో ఫ్రీ ప్రైమరీ శ్రీవిద్య స్కూళ్లను అంగన్వాడి కేంద్రాలకు అప్పగించాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే ఆందోళన భాగంగా జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారికి నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నదని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం సమ్మెలు ఆందోళనలు చేస్తున్న సందర్భంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడి టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచుతామని అన్నారని గుర్తు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సంవత్సరం పూర్తవుతున్న ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదని అంగన్వాడీ టీచర్లు ఆయాలు రిటైర్మెంట్ అయి సంవత్సరం కావస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు చెల్లించడం లేదని అన్నారు.
అనేక సెంటర్లకు టీచర్లు ఆయాలు లేక ఇబ్బందులు జరుగుతున్నాయని, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదని, నూతన విద్యా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి, రాష్ట్రంలో ఫ్రీ ప్రైమరీ శ్రీవిద్య అనే పేరుతో స్కూల్లోని సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సెంటర్లను అంగన్వాడి కేంద్రాలకే అప్పగించాలని కోరారు. గ్రామాలలో పట్టణాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి నేర్పించడంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ప్రధానమైన పాత్ర ఉన్నదని ప్రైవేటు స్కూలు పెరగడంతో ఇప్పటికే అంగన్వాడి స్కూల్ లలో పిల్లలు రాక ఇబ్బందులు జరుగుతున్నాయని టీ ప్రైమరీ శ్రీవిద్య సెంటర్లు తీసుకురావడం వల్ల ఇంకా అంగన్వాడి సెంటర్లకు పిల్లలు ఎక్కడ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేయాలనారు.
5 జి సిమ్ సౌకర్యం గల మొబైల్ ఫోన్లు ఇవ్వాలని చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచాలని అధికారుల వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిల్వేరు రామకుమారి పాల్గొన్నారు.