తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ శ్రీ విపి గౌతమ్ ఐఏఎస్
నవతెలంగాణ – భిక్కనూర్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేసే విధంగా చూడాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ శ్రీ వి.పి గౌతం ఐఎఎస్ తెలిపారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులనుపలు విషయాలు అడిగి తెలుసుకొని ఇసుక సరఫరా విషయంలో మండల తహశీల్దార్ ఉచితముగా సరఫరా చేయలని సూచించారు. అధిక వ్యయం కాకుండా తక్కువ ధరకే లభించే వస్తువులను కొనుగోలు చేయాలని ఇటుక, కంకర క్వారీల యజమానులతో మాట్లాడి ధరలను నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేయాలని డిఈ, పీడీకి సూచించారు.
లబ్దిదారులను బిల్లులు సకాలములో అందుతున్నాయా అనే విషయాలను అడుగగా అందరు లబ్ది దారులు కూడా సకాలములో అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. భిక్కనూర్ పట్టణ కేంద్ర పరిధిలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణము పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ చందర్ నాయక్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయపాల్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుభాష్, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ది అధికారి రాజ్ కిరణ్ రెడ్డి, తహశీల్దార్ సునీత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఆయా గ్రామల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇండ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక సరఫరా చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES