Wednesday, April 8, 2026
E-PAPER
Homeసినిమామహిళలకు ఉచిత ప్రదర్శన

మహిళలకు ఉచిత ప్రదర్శన

- Advertisement -

ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా ‘డైమండ్‌ డెకాయిట్‌” చిత్రం ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిత్ర ట్రైలర్‌ను వీక్షించి, యూనిట్‌ని అభినందించారు.
ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర యూనిట్‌ మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదించాలని చిత్ర బృందం కోరుతోంది.
ఈ చిత్రంలో పార్ధా గోపాల్‌ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించగా, మేఘనా రెడ్డి హీరోయిన్‌గా నటించారు.
రచయిత, దర్శకుడు సూర్య జి.యాదవ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి కుటుంబ వినోదంతో పాటు హద్యమైన భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కింది.
ఇప్పటికే నిర్వహించిన ప్రివ్యూ షోలలో పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత పార్ధా గోపాల్‌ మాట్లాడుతూ, ‘ఇదొక కంప్లీట్‌ ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా. ప్రతి కుటుంబం కనెక్ట్‌ అయ్యేలా కథ ఉంటుంది. కడపలో చిత్రీకరించిన అందమైన లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలకు 4 షోలు ఉచితంగా ఏర్పాటు చేశాం. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘ఈ సినిమాలో భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యేలా తెరకెక్కించాం. పూర్తిగా కడప జిల్లాలోనే చిత్రీకరించిన తొలి చిత్రం కావడం మాకు గర్వకారణం’ అని దర్శకుడు సూర్య జి. యాదవ్‌ చెప్పారు.
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, 60కి పైగా అందమైన కడప జిల్లా లొకేషన్లలో పూర్తిగా చిత్రీకరించడం. ఈ విజువల్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. కథనం, సహజమైన లొకేషన్లు, హృద్యమైన భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్ర బందం తెలిపింది. ఈనెల 10న విడుదలయ్యే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి, మహిళల కోసం ప్రకటించిన ప్రత్యేక ఆఫర్‌ను వినియోగించుకోవాలని చిత్ర యూనిట్‌ కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -