నవతెలంగాణ – కరీంనగర్
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో, డా. బి.ఎన్. రావు హెల్త్ ఫౌండేషన్ సౌజన్యంతో మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. హుజూరాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ మరియు నూకపల్లి నాక్ కేంద్రాల ద్వారా ఎంపికైన నిరుపేద మహిళలకు ఈ శిక్షణ నెల రోజుల పాటు ఇవ్వనున్నారు. ఈ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ డా. బి.ఎన్. రావు, ఫౌండేషన్ సెక్రటరీ ఝాన్సీ, గంగ, నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ జి. రమేష్, ఇతర నాక్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రైనింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రామాణిక శిక్షణా సర్టిఫికేట్‌లు అందజేయనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా డా. బి.ఎన్. రావు గారు మాట్లాడుతూ, “మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి ఈ శిక్షణ ఒక మైలురాయి అవుతుంది. స్వయం ఉపాధికి వీలుగా నైపుణ్యాలను అందించడమే మా ప్రధాన లక్ష్యం,” అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ గారు మాట్లాడుతూ, “ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి,” అన్నారు.
మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES