Sunday, October 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముస్లిం మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు

ముస్లిం మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు

- Advertisement -

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ప్రతి మహిళకు ఉపాధి – ప్రతి ఇంటికి ఆత్మవిశ్వాసం” అనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి యోజన కింద హైదరాబాద్‌లోని యూసఫ్‌ గూడలో ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసినట్టు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి శనివారం ఒక ప్రకటనలో లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక శక్తివికాసం దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళికతో మహిళల సాధికారత, ఉపాధి అవకాశాల సృష్టి, నైపుణ్యాభివృద్ధి దిశగా పనిచేస్తుందని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2,500 మంది ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. దీంతో తమ ఇండ్లల్లోనే కుట్టు పనులు, చిన్న స్థాయి వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి సాధించగలరనీ, కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునే అవకాశం వారికి లభిస్తుందని తెలిపారు. మహిళల సాధికారత కోసం భవిష్యత్‌లో ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు, సూక్ష్మ వ్యాపార సహాయ కేంద్రాలు, మార్కెటింగ్‌ లింకేజీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -