– ఈ సువర్ణ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోండి
– జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లాలోని రైతులకు ఆధునిక, పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయో చార్ నిపుణులు పరశురాం కైలాస్ అఖరే అధ్వర్యంలో బయో చార్ పై ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేసారు.
బుధవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో బయో చార్ తయారీ విధానం,దాని ప్రయోజనాలు,మట్టిసారాన్ని పెంపొందించడంలో బయో చార్ పాత్ర, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం, పంట దిగుబడులు పెంచడం వంటి అంశాల పై రైతులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనివడనికి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం అగ్రికల్చర్ కాలేజ్, అశ్వారావుపేట డాక్టర్ నాగ అంజలి ని(మొబైల్ నెంబర్ ను 94927 31222) సంప్రదించాలని తెలిపారు.



