- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ : మండలంలోని కుదాభక్షపల్లి గ్రామంలో గురువారం పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో భాగంగా గ్రామంలోని 21 గేదెలకు వివిధ రకాల వ్యాధులను గుర్తించి వైద్యం అందించుటతో పాటు 17 దూడలకు నట్టల నివారణ మందులను పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు గౌడ్,గ్రామ పెద్దలు,మండల పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్, డాక్టర్ ఎ.యమున, గోసాలమిత్ర సూపరెజర్ ప్రసాద్,గోపాలమిత్ర సుధాకర్ పాల్గొన్నారు.
- Advertisement -



