నవతెలంగాణ – కామారెడ్డి: కామారెడ్డి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పాల్వంచ మండలంలోని ఈసాయి పేట్ గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ పశు వైద్య శిబిరంలో పశు సంవర్దక శాఖ వైద్యులు గ్రామంలోని పశువులకు ఉచితంగా గాలికుంటూ టీకా, గర్భకోశ వ్యాధి శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో (32) పశువులకు గర్భకోశా వ్యాది చికిత్సలు, (18) పశువులకు చుడి పరీక్షలు, (15) దూడలకు నట్టల మందులు వేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సుదర్శన్ రావు, భూపతి, భూమయ్య, రాజలింగం, జ్యోతి రెడ్డి, ఏఎంసీ కార్యదర్శి ధర్సింగ్ , రమేష్, వైద్యులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ అనిల్ రెడ్డి, డాక్టర్ మౌనిక, డాక్టర్ హేమశ్రీ, పశు వైద్య సిబ్బంది, ఎల్ ఎస్ ఏ మాహేష్, ఓఎస్ రిజ్వాన్, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఈసాయి పేటలో ఉచిత పశువైద్య శిబిరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES