Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్వేదులలో ఉచిత పశువైద్య శిబిరం

పర్వేదులలో ఉచిత పశువైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర​
నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని పర్వేదుల గ్రామంలో  పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచి రమావత్  జీవిత రూప్ సింగ్, ఉప సర్పంచ్ దేవసాని మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా  వారు మాట్లాడుతూ.. పాడి పశువులకు సరైన సమయంలో వైద్యం అందించాలని సూచించారు. అనంతరం పెద్దవూర పశువైద్యాధికారి నులక నాగార్జున్ రెడ్డి  మాట్లాడుతూ పశువులు క్షేమంగా ఉంటేనే రైతులకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈనని పశువులకు 45 రోజుల తర్వాత కట్టు చూలి ఇంజక్షన్ వేయించాలన్నారు. లేగ దూడలు పుట్టిన పది రోజులకి పాములు మందు పట్టాలన్నారు.

ఆర్నెల్ల తర్వాత ప్రతి మూడు నెలలకు పేడ పరీక్షలు చేయించి రిపోర్ట్ ఆధారంగా  మందులు వాడాలని అన్నారు. పశు వైద్య శిబిరంలో 20 పశువులకు,25 లేక దూడలు, 32 గొర్రెలకు,30 గేదెలకు మందులు పట్టించామని తెలిపారు. గర్భకోశ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలోగోపాలమిత్ర సూపర్వైజర్  చిరుమర్తి రవికిరణ్,గోపాలమిత్ర కల్లూరీ మధు సూదన్ రెడ్డి,రైతులుపద్మ,కటుముల వెంకట్ రెడ్డి, ఓర్సు బాబు, ఓసు శీను, వల్లపు సైదులు, పులిమేల పకీర,కల్లూరు గోవింద్ రెడ్డి,వార్డు మెంబర్లు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -