Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యం లో పశు సంవర్ధక శాఖ వారి సహకారంతో శనివారం సీతాయిపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పశువైద్య  శిబిరంను  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్, వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఉచిత పశు వైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పశు వైద్యులు వేణు మాట్లాడుతూ.. 60 పశువులకు వైద్య శిబిరంలో చికిత్స చేశామని ఉచితంగా మందులు అందజేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్స్  సాయిలు, గౌని సాయిలు , అనిత బాలయ్య, రామావత్ ,బిల్ సింగ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి  సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -