Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండ్రుల జ్ఞాపకార్థం ఫ్రీజర్ వితరణ 

తండ్రుల జ్ఞాపకార్థం ఫ్రీజర్ వితరణ 

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని కొన సముందర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు మంగళవారం గ్రామ అభివృద్ధి కమిటీ వారి వారి తండ్రుల జ్ఞాపకార్థం ఫ్రీజర్ వితరణ చేశారు. గ్రామానికి చెందిన స్వర్గీయ మోటూరి భూమయ్య, మోటూరి గంగారాం జ్ఞాపకార్థం వారి కుమారులు మోటూరి శివనాథం, మోటూరి రమేష్, మోటూరి సురేష్ మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ ను విరాళంగా అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఫ్రీజర్ ను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు  అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మేల గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ఫ్రీజర్ దాతలైన మోటూరి కుటుంబ సభ్యులకు గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు శెట్టిపల్లి నారాయణ, క్యాషియర్ గంగాధర్, సభ్యుడు కాలేరు రాజేశ్వర్, సలహాదారులు చెమిమెల గంగాధర్, సామ బాపు రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -