- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
మునిపల్లి మండలం లోని మేళాసంఘం అంగన్వాడి కేంద్రంలో వరుసగా నెలలో రెండుసార్లు దొంగతనం జరిగింది. అంగన్వాడి కేంద్రం ఊరి చివర ఉండడం వల్ల బియ్యం, మంచి నూనె, గుడ్లు, తదితర వస్తువులు చోరీకి గురవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయమై స్థానిక అంగన్వాడి సూపర్వైజర్ నాగమణి వివరణ ఇస్తూ మహిళా సంఘం, అంగన్వాడీ కేంద్రంలో దొంగతనం విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అదేవిధంగా తరచూ పునరావృతమవుతున్న ఈ ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
- Advertisement -