Tuesday, February 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫ్రెష్‌ లవ్‌స్టోరీ

ఫ్రెష్‌ లవ్‌స్టోరీ

- Advertisement -

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. మానస వారణాసి హీరోయిన్‌. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. అజయ్ కుమార్‌ రాజు.పి కో ప్రొడ్యూసర్‌. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్‌ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్‌ చేస్తున్నారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ ఘనంగా లాంచ్‌ చేశారు.
మానస వారణాసి మాట్లాడుతూ,’ఈ చిత్రంలో మిత్ర అనే క్యారెక్టర్‌లో నటించాను. ఇలాంటి బ్యూటీఫుల్‌ క్యారెక్టర్‌లో నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ పాత్ర కూడా నాలాగే లైఫ్‌లో ఏదైన చేయాల్సి వస్తే ముందు యాక్షన్‌లోకి దిగేస్తుంది. ఎలాంటి డౌట్స్‌ పెట్టుకోదు.

ఈ సినిమా ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ లాంటిది. చెన్నై బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఫ్రెష్‌, యంగ్‌ లవ్‌ స్టోరీ’ అని అన్నారు. ‘మీ అందరికీ ట్రైలర్‌ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక హానెస్ట్‌ అటెంప్ట్‌ చేశారు అనే ఫీల్‌ మీ అందరిలో తప్పకుండా కలుగుతుంది’ అని డైరెక్టర్‌ అశ్విన్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ,’ఈ సినిమా నేను చూశాను. అదిరిపోయింది అంటూ చాలా మందికి కాల్స్‌ చేసి చెప్పాను. మనం ఎన్నో ప్రేమ కథలు చూస్తుంటాం. కానీ ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. ఇలాంటి కొత్త తరహా ప్రేమ కథలు రావాలి. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’ అని తెలిపారు. హీరో సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ,’ఇందులో మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తా. శివ, మిత్ర అనే పాత్రలు మిమ్మల్ని నవ్విస్తాయి, కదిలిస్తాయి. కాస్త ఏడిపిస్తాయి. ఇదొక జెన్యూన్‌ ఇంటెన్షన్‌తో, హానెస్ట్‌గా చేసిన సినిమా. ఇది నా కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -